పారాగ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు 100 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడి ఓ మహిళా టూరిస్టు, ఇన్‌స్ట్రక్టర్ మరణించారు. ఉత్తర గోవాలోని కేరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని పూణెకు చెందిన 27 ఏళ్ల మహిళా పర్యాటకురాలు శనివారం సాయంత్రం గోవాకు చేరుకుంది. సుమల్ నేపాలీ అనే 26 ఏళ్ల ఇన్‌స్ట్రక్టర్ సాయం తీసుకుని పారాగ్లైడింగ్ ప్రారంభించింది.
పారాగ్లైడింగ్ చేస్తుండగా 100 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ చనిపోయారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ అక్రమంగా పారాగ్లైడింగ్ నిర్వహించిందని పోలీసులు తెలిపారు. కంపెనీ యజమాని శేఖర్ రైజాపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.