హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ వద్ద పెను ప్రమాదం తప్పింది. మాసబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్ పై వెళుతున్న ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి . మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఎక్కుతున్న సమయంలోనే ఈ టస్కర్ వాహనంలో నుంచి ఆయిల్ డ్రమ్ములు కిందపడిపోయాయి. దీంతో రోడ్డు మొత్తం ఆయిల్ విస్తరించింది. కిందపడిన ఆయిల్ ను గమనించకపోవడంతో వాహన దారులు స్కిడ్ అయ్యి పడిపోయారు. మొత్తం కింద నాలుగు డ్రమ్ములు రోడ్డుపై పడి పోయాయి. ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకవడంతో రోడ్డుపై పారుతున్నది. దీంతో అనేక వాహనాలు రోడ్డుపై జారీ పడ్డాయి..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్యాంకర్‌ను క్రేన్ సహాయంతో తొలగించారు..ఒక్కో డ్రమ్ 800 లీటర్ల సామర్థ్యం కలిగివుంది. అప్పటికే భారీగా ట్రాఫిక్ జాం అయింది. కిలోమీటర్ల మేర వాహనాల ఆగిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై సుమారు 50 ట్రిప్పుల మట్టిని జిహెచ్ఎంసి సిబ్బంది పోశారు. రోడ్డుపై మట్టి పోసి ట్రాఫిక్ పోలీసులు.. వాహన రాకపోకలను పునరుద్ధరించారు. ఈ నాలుగు గంటలు మసాబ్ ట్యాంక్, మెహదీపట్నం రూట్ ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయింది.. వాహనదారులు నరకం చూశారు..