హర్యానా – షూటర్ మను భాకర్ ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మామయ్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలోని చర్‌ఖీ దాదరీలోని మహేంద్రగఢ్ బైపాస్ జరిగిన ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. స్కూటీ, బ్రెజ్జా కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత.. డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం సివిల్ ఆసుపత్రికి పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -