Friday, November 22, 2024

Accident in Uttar Pradesh – 12 మంది ప్రాణాలు బ‌లిగొన్న మంచు…

ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని షాజహాన్‌పూర్ జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. అల్హాగంజ్ ప్రాంతంలోని సుగుసుగి మలుపు వద్ద ట్రక్కు ఢీకొనడంతో టెంపోలో ప్రయాణిస్తున్న 12 మంది మృతి చెందారు. టెంపో నడుపుతున్న వ్యక్తులు మద్నాపూర్‌లోని దమ్‌గడ గ్రామానికి చెందిన వారు. వీరంతా పుస్‌పూర్ణిమ రోజున గంగాస్నానం చేసేందుకు ఫరూఖాబాద్‌లోని ఘటియాఘాట్‌లోని పంచల్‌ఘాట్‌కు వెళ్తున్నారు. పొగమంచు ఎక్కువగా ఉంది.. దీంతో ముందు నుంచి వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఆటో ట్రక్కులో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత డ్రైవర్ లారీని వెనక్కి తీసుకెళ్లడంతో మళ్లీ ట్రక్కును టెంపోపై ఎక్కింది. దీంతో గాయపడిన వారు కూడా అక్కడికక్కడే మృతి చెందారు.

ఘోర ప్రమాదం జరగడంతో రోడ్డుపై భారీగా అరుపులు వినిపించాయి. దీంతో లారీ డ్రైవర్‌ భయపడి పారిపోయాడు. అరుపులు విని సమీపంలో జనం గుమిగూడారు. క్షతగాత్రులను తరలించే ప్రయత్నం చేసేటప్పటికే అందరూ చనిపోయారు. ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement