జెడ్డా – సౌదీ ఆరేబియాలో బుధవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సౌదీలోని జిజాన్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 9 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. జిజాన్ నుంచి పని ప్రదేశానికి 26మందితో వెళుతున్న బస్సు మధ్యలో టైలర్ ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది మరణించారు.. వారిలో తొమ్మిది మంద ఇండియన్స్ ఉన్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.. ఈ ప్రమాదంలో గాయపడిన 10 మందిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.. ఇది ఇలా ఉంటే భారతీయు మృతి చెందిన విషయాన్ని జెడ్డాలోని భారత ఎంబసీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నామని, మృతుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని పేర్కొంది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసింది. కాగా, మృతులు వివరాలు వెల్లడించలేదు..
ఇది ఇలా ఉంటే జెడ్డాలోని రాయబార కార్యాలయంతో తాను మాట్లాడానని, ప్రమాదం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఇండియన్ కాన్సులేట్ బాధిత కుటుంబాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతోందని అన్నారు. బాధిత కుటుంబాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఈ ప్రమాదంపై బాధిత కుటుంబాలు సమాచారం తెలుసుకోవడం కోసం అక్కడి ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. సమాచారం కోసం 8002440003 (టోల్‌ఫ్రీ), 0122614093, 0126614276, 0556122301 (వాట్సాప్) నెంబర్లలో సంప్రదించాలని తెలిపింది.