Thursday, December 26, 2024

Accident – గోవా సముద్రంలో బోటు బోల్తా

పనజి: క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్ల కోసం గోవా బీచ్‌కు పర్యటకులు పెరుగుతున్న వేళ బుధవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. నార్త్ గోవాలోని కాలంగుటె బీచ్ అరేబియన్ సముద్రంలో పర్యాటకుల పడవ బోల్తా పడి ఒకరు మరణించారు.

20 మందిని రెస్య్కూ టీమ్ కాపాడింది. మరణించిన వ్యక్తిని 54 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. పడవ ప్రమాదంలో రక్షించిన 20 మందిని సమీప ఆసుపత్రికి తరలించామని, ప్రయాణికుల్లో ఇద్దరు మినహా పిల్లా పెద్దలందరూ లైఫ్ జాకెట్లు వేసుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. తీర ప్రాంతానికి సుమారు 60 మీటర్ల దూరంలో పడవ బోల్తాపడిందని, దీంతో అందరూ సముద్రంలో పడిపోయారని లైఫ్ సేవింగ్ ఏజెన్సీ దృష్టి మెరైన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

పడవలోని 13 మంది మహారాష్ట్రలోని ఖేడ్ నుంచి వచ్చారని, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని వివరించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విధి నిర్వహణలో ఉన్న 18 మంది లైఫ్‌ సేవర్లు ప్రయాణికులను కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారని, వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించి కొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించామని చెప్పారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement