ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో గల నైనిటాల్ హైవేపై గత అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బరేలీ నుంచి బహేరీ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు టైరు పగిలి, డివైడర్‌ను దాటి అటువైపు నుంచి వస్తున్న డంపర్‌ను ఢీకొంది. దీంతో ఈ రెండు వాహనాల్లో పేలుడు సంభవించి, మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఎనిమిది మంది సజీవదహనమయ్యారు.
వివరాల్లోకి వెళితే బహేరి నివాసి సుమిత్ గుప్తాకు బమ ఈ పెళ్లి ఊరేగింపులో వినియోగించేందుకు ఈ కారును బుక్ చేసుకున్నారు. ఆ కారు భోజిపురా పోలీస్ స్టేషన్‌కు 1.25 కి.మీ దూరంలోని బహెరీ దిశలో ఉన్న దబౌరా గ్రామ సమీపంలో కారు టైరు అకస్మాత్తుగా పగిలింది. దీంతో కారు బ్యాలెన్స్ తప్పి డివైడర్‌ను దాటి అటువైపు మళ్లి, ఎదురుగా వస్తున్న డంపర్‌ను ఢీకొంది. పెద్ద శబ్ధంతో కారులో మంటలు చెలరేగాయి. డంపర్ ఈ కారును దాదాపు 25 మీటర్ల మేరకు ఈడ్చుకెళ్లింది. డంపర్ ముందు భాగం కూడా మంటల్లో చిక్కుకుంది. .ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు.