తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా… ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. దీంతో 13 నుంచి 23 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్‌లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో ఆయన తన పాస్‌పోర్టును ఏసీబీ కోర్టుకు అప్పగించారు. తాజాగా, విదేశీ పర్యటనల నేపథ్యంలో రేవంత్ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన కోర్టు… జులై 6వ తేదీ లోగా పాస్ పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.