Tuesday, November 26, 2024

గంజాయితో పట్టుబడ్డ విద్యాధికులు.. పోలీసుల‌ను చూసి పారిపోతుంటే..

నర్సీపట్నం, (అనకాపల్లి) ప్రభ న్యూస్‌: వాళ్లంతా ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థులు. బీటెక్‌ ఒకరు, ఎంబీఏ ఒకరు, డిగ్రీ మరొకరు చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు చేసుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళవలసిన వారికి గంజాయి అనే వ్యసనం అలవాటు కావడంతో చీరాల నుంచి ద్విచక్ర వాహనాలపై నర్సీపట్నం వచ్చి గంజాయి కొనుగోలు చేసుకుని తిరిగి వెళ్తుండగా పోలీసులకు పట్టుబడిన సంఘటన బుధవారం నర్సీపట్నంలో జరిగింది . ఎస్సై దివాకర్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం నర్సీపట్నం డిగ్రీ కళాశాల వద్ద తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా రెండు ద్విచక్ర వాహనాల్లో నలుగురు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకొని తనిఖీ చేయగా వీరి వద్ద నుంచి ఎనిమిది కేజీల గంజాయి పట్టుబడిందన్నారు.

వీరిలో చీరాలకు చెందిన గుంటూరు శ్రీనాధు(24), భవానీ శంకర్‌(28), పవన్‌ కు మార్‌(28), రామవెంకటేష్‌(28) అనే నలుగురు విద్యార్థులను అరెస్టు చేశామన్నారు. గంజాయికి అలవాటుపడి వీరు సొంతానికి వాడుకోవడం కోసం ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి తరలిస్తు పట్టుబడ్డారన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement