అబ్రకదభ్రా అంతా మాయాగా శ్రీ చైతన్య లీలలు కొనసాగుతున్నాయి. స్కూల్‌కు పర్మీషన్ లేకుండానే.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మీషన్లు జరుపుతున్నారు. వేళాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ అమాయకులనే కాదు.. మేధావులను, విద్యావంతులను యాజమాన్యం తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని విద్యా వ్యాపార దుకాణాన్ని చేవెళ్లలో తెరిచింది. గతంలో కళాశాల నడిచిన భవనాన్ని తీసుకుని దానికి రంగులు వేసి శ్రీ చైతన్య బోర్డు తగిల్చించి అడ్మిషన్ల దుకాణానికి తెరలేపింది. అన్ని అనుమతులున్నారు… అంటూ గ్రామాల్లో క్యాన్వసింగ్ చేస్తూ.. మొదట ప్రవేశం తీసుకున్న వారికి రాయితీలు కల్పిస్తున్నామని, ఫీజుల వసూళ్లను ప్రారంభించింది. విశ్వసనీయ సమాచారం అందుకున్న చేవెళ్ల ఎంఈవో అక్బర్ పాఠశాలకు వెళ్లగా నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి.
చేవెళ్ల, మే18 (ప్రభ న్యూస్ ) :
శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరిక్యూలమ్ యాజమాన్యం చేవెళ్లలో సైతం అబ్రకదభ్రా అనే సిద్ధాంతాన్ని మొదలెట్టింది… అమాయకులనే కాదు.. మేధావులను, విద్యావంతులను యాజమాన్యం మాయచేస్తుంది.. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మాయమాటలు చెప్పి విద్యా వ్యాపార దుకాణాన్ని చేవెళ్లలో తెరిచింది. విద్యార్థుల భవిష్యత్, జీవితాలపై ఆటలాడేందుకు సిద్ధమైంది.. కనీస అనుమతులు లేకుండానే విద్యా వ్యాపారాన్ని చేవెళ్లలో మొదలు పెట్టింది. గతంలో కళాశాల నడిచిన భవనాన్ని తీసుకుని దానికి రంగులు వేసి శ్రీ చైతన్య బోర్డు తగిలించి అడ్మిషన్ల దుకా ణానికి తెరలేపింది. అన్ని అనుమ తులు న్నాయ్… అం టూ గ్రామాల్లో క్యాన్వ సింగ్ చేస్తూ.. మొదట ప్రవేశం తీసుకున్న వారికి రాయితీలు కల్పిస్తున్నామని, ఫీజుల వసూళ్లను ప్రారంభించింది. శ్రీ చైతన్య పేరు విని ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఈ పాఠశాలలో అడ్మిషన్‌లు పొందినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం అందుకున్న చేవెళ్ల ఎంఈవో అక్బర్ పాఠశాలకు వెళ్లగా నివ్వెర్రపోయి నిజాలు బయటప డ్డాయి. అనామక కనీస విద్యార్హత లేని వారిని అక్కడ కూర్చోబెట్టి అడ్మిషన్లు, వసూళ్లను ప్రారంభించింది యాజమాన్యం. కనీసం ఆర్‌ఐ, ప్రిన్సిపాల్, డైరెక్టర్ ఎవరూ అందుబాటులో లేరు. అనుమతి పత్రాలు చూపమంటే అక్కడ ఉన్న సిబ్బంది తమకు ఏమి తెలియదని చేతులెత్తేశారు. శ్రీ చైతన్య స్కూల్‌కు నో – ఫర్మీషన్.
చేవెళ్ల పట్టణ కేంద్రంలో శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరిక్యూలమ్ తమ బ్రాంచ్‌ను అనుమతి లేకుండానే విస్తరించింది. బ్రాండ్ పేరుపై నమ్మి కనీసం ఫర్మీషన్ ఇందా లేదా చూడకుండానే వేలాది మంది విద్యార్థులను తమ పిల్లలను తల్లిదండ్రులు అడ్మిషన్లు చేసినట్లు సమాచారం. అయితే ఈ పాఠశాలకు ఎలాంటి కనీస ఫర్మీషన్ లేదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరుక్యూలమ్ పేరుపై పాఠశాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని విద్యాధికారులు తేల్చిచెప్పారు. హైదరాబాద్ నగరంకు కూతవేటు దూరంలో చేవెళ్ల నియోజకవర్గ కేంద్రం నడిబొడ్డున ఈ విద్యా వ్యాపారాన్ని కొనసాగించేందుకు పునా దులు వేసుకున్న ఈ యాజమాన్యాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని పలువురు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు ఎలా ప్రారంభిస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
వేలాది రూపాయల ఫీజుల వసూళ్లు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేవెళ్లలో శ్రీ చైతన్య యాజమాన్యం పాతర వేసింది. కనీసం అనుమతులు కూడా లేకుండానే అడ్మిషన్లు మొదలెట్టడం నిబంధనలకు విరుద్ధంగా అధిక శాతం ఫీజులు కూడా వసూళ్లు చేయడం జరిగింది. ప్రభుత్వ నిర్దేశించిన ఫీజుల మార్గదర్శకాలను కూడా పాటించలేదు. అసలు అనుమతులే లేనిది ఫీజులు కూడా వసూళ్లు చేయడం గమనార్హం. మొదటి తరగతికి రూ.37వేల ఫీజు, అదేవిధంగా టూషన్ ఫీజు అదనం, ఇంకా ఇతర ఫీజులు వసూళ్లు చేస్తున్న ట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఇది కేవలం అడ్మిషన్ ఫాంలో, రిజిస్ట్రార్‌లలో తనిఖీ చేయగా బయటపడ్డ విషయం. ఇంకా అనాధికారికంగా ఎంత పెద్ద మొత ్తంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నారో తెలియదు. అదేవి ధంగా తరగతి గ దుల నిర్మాణం కూడా ఘోరంగా ఉంది. కనీస సదుపాయాలు ఇక్కడ కనిపించలేదు. నిబం ధనలకు పాత రవేసి సెల్లార్‌లో తరగతి గదు లను ఏర్పాటు చేశారు. త్రాగునీటి, మరుగుదొ డ్లు వంటి కనీస సౌకర్యలలేమి స్పష్టంగా కనిపిం చింది.
అనుమతులు లేవు అతిత్వరలో సీజ్ చేస్తాం : ఎంఈవో సయ్యద్ అక్బర్
చేవెళ్ల పట్టణ కేంద్రంలో శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరిక్యూలమ్ స్కూల్‌కు ఎలాంటి అనుమతులు లేవని ఎంఈవో సయ్యద్ అక్బర్ స్పష్టం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఆయన శ్రీ చైతన్య పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ ప్రిన్సిపాల్, డైరెక్టర్ వంటి యాజమాన్యం ఎవరూ లేరు. క్రిందిస్థాయి సిబ్బంది అడ్మిషన్లు తీసుకుంటూ కనిపించారు. దీంతో ఆయన ఫర్మీషన్ లేనిది ఎలా అడ్మిషన్లు తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రిన్సిపాల్ ఏజీఎంకు ఫోన్ చేయగా వారు ఎంఈవో ఫోన్‌ను లిఫ్ట్ చేయలేదు. వెంటనే యాజమాన్యంను మండల విద్యాధికారి కార్యాలయంలో కలవాలని అక్కడి వారికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభ న్యూస్‌తో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు స్కూల్ నిర్వహణ కోసం తమకు ఎలాంటి కనీస అనుమతి దరఖాస్తులు కూడా శ్రీ చైతన్య యాజమాన్యం పెట్టుకోలేదని, ఈ స్కూల్‌కు ఎలాంటి అనుమతులు లేవని ఆయన తేల్చిచెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు తొందరపడి ఈ స్కూల్‌లో తమ పిల్లలను అడ్మిషన్ చేయవద్దని సూచించారు.