Friday, September 6, 2024

Lithium | కర్ణాటకలో 1,600 టన్నుల లిథియం నిక్షేపాల గుర్తింపు..

సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్‌తో సహా బహుళ పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కర్ణాటకలో లిథియం వనరులను కనుగొన్నట్లు ప్రకటించారు. మండ్య జిల్లాలోని మర్లగల్ల ప్రాంతంలో దాదాపు 1,600 టన్నుల లిథియం వనరులను గుర్తించింది అని తెలిపారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (AMD) ప్రాథమిక సర్వేలు, పరిమిత ఉపరితల అన్వేషణల ద్వారా.. భారతదేశంలోని పలు ప్రాంతాలలో లిథియం కోసం చురుకుగా అన్వేషిస్తోందని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement