గుండెపోటుతో ప్రముఖ ఆర్థికవేత్త.. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో దేశంలోని అగ్రగామి నిపుణులలో ఒకరైన అభిజిత్ సేన్ ఢిల్లీలో కన్నుమూశారు.ఆయన వయసు 72సంవత్సరాలు. గుండెపోటు వచ్చిందని, ఆసుప్రతికి తీసుకెళ్లేలోపే ఆయన మరణించారని సేన్ సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ చెప్పారు. ఆర్థిక శాస్త్రంలో నాలుగు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన అభిజిత్ సేన్ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం బోధించారు. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ అధ్యక్ష పదవి సహా అనేక ముఖ్యమైన ప్రభుత్వ పదవులను నిర్వహించారు. అభిజిత్ సేన్ ఢిల్లీలోని బెంగాలీ కుటుంబంలో జన్మించారు. సర్దార్ పటేల్ విద్యాలయలో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆయన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఫిజిక్స్ ఆనర్స్ డిగ్రీ అందుకున్నారు. 1981లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అక్కడ ఆయన ట్రినిటీ హాల్ సభ్యుడిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2014 వరకు ప్రణాళికా సంఘం సభ్యుడిగా పదేళ్లు పని చేశారు. ఆయనకి పలువురు సంతాపం తెలియజేశారు.
గుండెపోటుతో మృతి చెందిన – ప్రముఖ ఆర్థికవేత్త..ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు అభిజిత్
Advertisement
తాజా వార్తలు
Advertisement