Friday, November 22, 2024

National : కాల్పులతో ద‌ద్ద‌రిల్లిన అభ‌యఅరణ్యాలు…12మంది మావోల మృతి..

తాజాగా పోలీసుల ఎదురుకాల్పుల్లో అభయ అరణ్యాలు కాల్పుల శబ్దాలతో దద్దరిల్లాయి. దేశవ్యాప్తంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ఛత్తీస్‌ఘ‌డ్‌లోని బీజాపూర్ జిల్లాలో సమావేశమయ్యారు. ఇక ఎన్నికల నేపథ్యంలో బస్తర్‌ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహం పై మావోయిస్టులు సమావేశం నిర్వహించగా.. ఆ విషయం తెలుసుకొని పక్క ప్రణాళికలతో భద్రత బలగాలు వారిపై గాలింపులు చేపట్టాయి.

- Advertisement -

దీంతో భద్రత బలగాలకి ఎదురైన మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలో మొత్తం పదిమంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రత బలగాలు తెలిపారు. ఇక మరోవైపు మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో మావోయిస్టు దళాలు సమావేశం కారణంగా.. మావోయిస్టు చర్యలు జరిపే అవకాశం ఉందని నియోజకవర్గాల పక్క సమాచారంతో సోమవారం రాత్రి సమయంలో బస్తర్‌ ఫైటర్స్‌, డీఆర్జీ, కోబ్రా, సీఆర్‌పీఎఫ్‌ భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం కోర్చోలీ అడవి ప్రాంతంలో మావోయిస్టులకు భద్రత బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. దాదాపు మూడు గంటల సమయం పాటు ఇరువురి మధ్య కాల్పులు జరిగాయి. మొదటగా కాల్పులు జరిగిన ప్రదేశంలో పోలీసులు 4 మృత దేహాలు గుర్తించిగా మిగిలిన వారి కోసం భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా.. మరో ఆరు మృతదేహాలు వారికి లభించాయి. మరికొందరు తీవ్ర గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల నుండి అనేక మందు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే చనిపోయిన మావోయిస్టులను పోలీసులు గుర్తించాల్సి ఉంది.

ఇక మరోవైపు మధ్యప్రదేశ్ ఛత్తీస్‌ఘ‌డ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన బాలాఘాట్‌ జిల్లా కేరజారి అటవీ ప్రాంతంలో తాజాగా బలగాలు మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తంగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ దాడుల్లో మరో మావోయిస్టు నేతకు గాయాలు అయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కాల్పుల్లో మావోయిస్టులైన డిజిటల్ కమిటీ సభ్యురాలు సాజంతి అలియాస్ క్రాంతి, అలాగే ఆ ప్రాంత ఏరియా కమిటీ సభ్యుడైన రఘు అలియాస్ షేర్ సింగ్ కాల్పుల్లో మరణించారు. ఈ కాల్పుల్లో వారి నుంచి కాస్త మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మరణించిన వారిపై ఇదివరకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం రివార్డులను కూడా ఉంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement