Tuesday, November 26, 2024

ఏబీ డివిల్లియర్స్ రిట‌ర్న్ టూ ఆర్ సీబీ, కానీ ప్లేయ‌ర్ గా కాదు.!

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌. దిగ్గజ ఆటగాడు ఏబీ డివిల్లియర్స్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి ఆటగాడిగా కాకుండా.. మెంటార్‌ పాత్రలో ఆర్సీబీ జట్టులో కనిపించనున్నాడు. ఐపీఎల్‌లో ఆడినంత కాలం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకే ప్రాతినిథ్యం వహించిన డివిల్లియర్స్‌ గతేడాది క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్స్‌కు వీడ్కోలు పలికాడు. 12వ తేదీన సాయంత్రం 4 గంటలకు జట్టుకు సంబంధించిన కీలక అప్‌డేట్లను ప్రకటిస్తామని ఇప్పటికే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. తమ జట్టు కెప్టెన్‌తో పాటు ఇతర వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.

ఇందులో భాగంగానే 38 ఏళ్ల డివిల్లియర్స్‌ను మెంటార్‌గా నియమించనుందని సమాచారం. ఈ మేరకు దక్షిణాఫ్రికాకు చెందిన డివిల్లియర్స్‌ను సన్నిహిత మిత్రుడైన విరాట్‌ కోరడంతో ఏబీ కాదనలేకపోయాడని సమాచారం. ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన డుప్లెసిస్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఆర్సీబీ తరఫున ఆడిన డివిల్లియర్స్‌ గత ఐపీఎల్‌లో 15 మ్యాచుల్లో 148.34 స్ట్రయిక్‌ రేట్‌తో 313 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలున్నాయి. ఐపీఎల్‌ మొత్తంలో 184 మ్యాచుల్లో 39 సగటుతో.. 5162 రన్స్‌ చేశాడు. స్ట్రయిక్‌ రేట్‌ 151గా ఉంది. 3 సెంచరీలు, 40 అర్ధ సెంచరీలున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement