హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రైవేట్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ కింద చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఎంఐఎం శాసన మండలి సభ్యుడు అఫెండీ ప్రభుత్వాన్ని కోరారు. బడ్జెట్ శాసన సభ సమావేశాల సందర్భంగా గురువారం శాసన మండలిలో బడ్జెట్ కేటాయింపులపై సాధారణ చర్చ జరగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య శాఖలో మరిన్ని ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సీఎంఆర్ఎఫ్కు ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పడుతోందని, వీలైనంత త్వరగా బాధితులకు నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2014 నుంచి జీహెచ్ఎంసీ ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉందని, తెలంగాణలో ఉద్యోగులకు సమయానికి వేతనాలు అందటం లేదన్నారు. షాదీముబారక్‌ను గ్రీన్‌ఛానల్ నుంచి తొలగించారని, దాన్ని మళ్లీ అలాగే కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.