Tuesday, November 26, 2024

ఆప్ సంచలన నిర్ణయం.. పంజాబ్‌లో మాజీలకు భద్రత తొలగింపు

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా 16వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆమ్‌ ఆద్మీ నేత భగవంత్‌ మాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి చెందిన కీలక నేతల భద్రతను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ జాబితాలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలున్నారు. సిద్ధూ సహా 122 మంది మాజీ ఎమ్మెల్యేలున్నారు. వీరందరి సెక్యూరిటీని శనివారం వెనక్కి పిలిపించారు. ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ కుటుంబ సభ్యులు, మాజీ సీఎంలు అమరీందర్‌ సింగ్‌, చరణ్‌జిత్‌ చన్నీ మినహా మిగతా కాంగ్రెస్‌, అకాలీదళ్‌ నేతల సెక్యూరిటీని ఎత్తివేశారు. గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ను కలిసిన మాన్‌, ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాగా, వేణు ప్రసాద్‌ను ప్రిన్సిపాల్‌ సెక్రెటరీగా నియమించారు.

ఆయన 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. శుక్రవారం మొహాలీలో జరిగిన ఆప్‌ ఎమ్మెల్యేల సమావేశంలో మాన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేల మద్దతను లేఖను గవర్నర్‌కి సమర్పించామని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరామని ఆప్‌ పంజాబ్‌ ఇన్‌చార్జి రాఘవ్‌ చద్దా మీడియాకు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే వేదిక గురించి సమాచారం ఇచ్చామన్నారు. భగవంత్‌ మాన్‌ స్వగ్రామంలో ఈ నెల 16న మధ్యాహ్నం 12.30 గంటలకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. హర్పాల్‌ సింగ్‌ చీమా, అమన్‌ అరోరా, బల్జిdందర్‌ కౌర్‌, సరవ్‌జిత్‌ కౌర్‌ మనుకే, గుర్మీత్‌ సింగ్‌ మీత్‌ #హయర్‌, బుధ్‌ రామ్‌, కున్వర్‌ విజయ్‌ ప్రతాప్‌ సింగ్‌, జీవన్‌జ్యోత్‌ కౌర్‌, డాక్టర్‌ చరణ్‌జిత్‌ సింగ్‌లతో సహా పలువురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement