న్యూఢిల్లీ: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారు. నిబంధలను ఉల్లంఘించి తమ సమ్మతి లేకుండా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపినట్టుగా ఐదుగురు ఎంపీలు రాజ్యసభ వైఎస్ చైర్మెన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎంపీల ఫిర్యాదు నేపథ్యంలో ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ నుండి ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ను సస్పెండ్ చేశారు.
ఈ విషయమై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో శుక్రవారం నాడు తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించింది. ఆప్ ఎంపీ సభా నియమ నిబంధలను దారుణంగా ఉల్లంఘించారని ఆయన విమర్శలు చేశారు.