మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ నేత, ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను 14 రోజుల జుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. మనీల్యాండరింగ్ కేసులో రోజ్ అవెన్యూ కోర్టు కస్టడీకి ఆదేశాలు ఇచ్చింది. గత నెలలో ఈడీ ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2017 నుంచి మనీల్యాండరింగ్ కేసులో విచారణ జరుగుతోంది. మే 30వ తేదీన మినిస్టర్‌ను అరెస్టు చేశారు. జూన్ 7వ తేదీన జరిగిన తనిఖీల్లో మంత్రి ఇంటి వద్ద అనేక డాక్యుమెంట్లు, రికార్డులు లభించాయి. సత్యేందర్ జైన్ ఇంట్లో సుమారు రెండు కోట్ల నగదును, రెండు కిలోల బంగారాన్ని సీజ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement