Sunday, November 17, 2024

AAP – కేజ్రీవాల్‌కు షాక్ .. పార్టీకి, మంత్రి ప‌ద‌వికి లాష్ గెహ్లాట్ రాజీనామా

న్యూ ఢిల్లీ – ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖ నేత కైలాష్ గెహ్లాట్ ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌కు నేడు లేఖ రాశారు. తన రాజీనామాలో యమునాను శుభ్రపరచడం, కేజ్రీవాల్ బంగ్లా నిర్మాణం అంశాన్ని కూడా లేవనెత్తారు. గత ఎన్నికల్లో యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇచ్చామని, అయితే యమునా నదిని శుభ్రం చేయలేకపోయామని గెహ్లాట్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement