Wednesday, December 18, 2024

Delhi elections | ఆప్ నాలుగో జాబితా విడుదల..

వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కూడా ఢిల్లీలో ఆప్ జెండా ఎగురవేయాలని అరవింద్ కేజ్రీవాల్ కృతనిశ్చయంతో ఉన్నారు. కాగా, ఇప్పటికే మూడు జాబితాలను ప్రకటించిన ఆప్, నేడు పోటీలో ఉన్న అభ్యర్థుల నాలుగో జాబితాను ఆప్ కన్వీనర్ ప్రకటించారు. ఈ జాబితాలో కేజ్రీవాల్‌తో సహా పలువురి పేర్లు ఉన్నాయి.

ఆప్‌ చీఫ్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తోన్న న్యూఢిల్లీ సీటు నుంచే పోటీ చేయనున్నారు. అలాగే కల్కాజీ నుంచి ముఖ్యమంత్రి అతిషి పోటీ చేయనున్నారు. గ్రేటర్ కైలాష్ నుంచి మంత్రి సౌరభ్ భరద్వాజ్, బాబర్‌పూర్ నుంచి గోపాల్ రాయ్ బరిలోకి దిగుతున్నారు. శకుర్ బస్తీ నుంచి సత్యేంద్ర కుమార్ జైన్, రాజిందర్ నగర్ నుంచి దుర్గేష్ పాఠక్ పోటీ చేయనున్నారు. మొత్తం 70 మంది అభ్యర్థుల్లో 20 మంది సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement