న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆప్, బీజేపీ కార్పొరేటర్లు కొట్టు కున్నారు. మహిళా కార్పొరేటర్లు జుట్లు పట్టుకుని మరీ ఫైట్ చేశారు. వివరాలలోకి వెళితే బుధవారమే స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక కూడా పూర్తికావాల్సి ఉన్నా ఓటింగ్ విషయంలో రెండు పార్టీల మధ్య గొడవ జరిగింది. దాంతో ఆప్, బీజేపీ సభ్యులు ఒకరినొకరు కొట్టకున్నారు. చేతికి ఏది దొరికితే అది ఒకరిపై ఒకరు విసిరేసుకున్నారు. దాంతో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇవాళ గొడవల మధ్యే ఎన్నిక జరిగింది. అయితే, ఫలితాల విషయంలో రెండు పార్టీల మధ్య మళ్లీ గొడవ ముదిరింది .ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు చెల్లదంటూ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రకటించడంతో సభలో బాహాబాహీ చోటుచేసుకుంది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. అధికార ఆమ్‌ఆద్మీపార్టీ కౌన్సిలర్లు, ప్రతిపక్ష భాజపా కౌన్సిలర్లు ఢీ అంటే ఢీ అన్నారు. పరస్పరం పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. జట్టు పట్టుకొని ఒకరినొకరు ఈడ్చుకున్నారు. చొక్కాలు చించుకుంటూ తీవ్ర గందరగోళం సృష్టించారు. కౌన్సిలర్ల పరస్పర దాడిలో చాలా మందికి గాయాలయ్యాయి. కొంతమంది బట్టలు చిరిగిపోయాయి. ఈ గొడవలో ఒక కౌన్సిలర్ మూర్చపోయి కిందపడిపోయారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement