Friday, November 22, 2024

Delhi: ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన…

ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలతో ఢిల్లీలో ఉద్రిక్తత నెల‌కొంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పార్టీ నేతలు,కార్యకర్తలు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. ప్రశ్నించిన వారందరినీ జైల్లో పెడుతున్నారని, తమ పార్టీని అంతం చేసేందుకే పార్టీ నేతలపై వరసగా అక్రమ కేసులు పెడుతూ జైల్లోకి నెడుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

- Advertisement -

తనకు బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ ఆపరేషన్ ఝాడు పేరుతో బీజేపీ మరో కార్యక్రమాన్ని మొదలు పెట్టిందన్నారు. పార్టీ బ్యాంకు అకౌంట్లను కూడా సీజ్ చేయడమేంటని ప్రశ్నించారు. తమ పార్టీ కార్యాలయాన్ని కూడా మూసివేయంచారన్నారు. తమ పార్టీ నేతలందరినీ జైల్లో పెట్టమంటూ ఆయన సవాల్ విసిరారు. పార్టీ నేత భిభవ్ కుమార్ అరెస్ట్ కు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడికి బయలుదేరారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement