మానవత్వం మంట కలిసి పోతున్న వేళ…. తోడబుట్టిన చెల్లెలిని లైంగికంగా హింసించారు ఇద్దరు కామాంధులు. చిన్నతనం నుంచే తనపై లైంగిక వేధింపులు వేధింపులకు పాల్పడ్డారు. అంతే కాదు విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం రామవరం లో స్నేహిత అమ్మ అన్నల తో కలిసి ఉంటుంది. చిన్నతనంలోనే తండ్రి వేరొక మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ ముగ్గురినీ విడిచిపెట్టేశాడు. ఇక అప్పటి నుంచి కూడా మొత్తం బాధ్యతలు తీసుకొని తల్లి వీరిని పెంచింది. అయితే భర్త మాత్రం పలుమార్లు ఇంటికి వచ్చి గొడవ పడేవాడు.
ఆ సమయంలో స్నేహిత ను అన్న సుశీల్ కుమార్ ఓ గదిలోకి తీసుకు వెళ్లి బట్టలు విప్పించి చేతులు కట్టేసి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ విషయం తన తల్లికి చెప్పిన తల్లి పట్టించుకోలేదు. ఇలానే చాలాసార్లు సుశీల్ కుమార్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరోవైపు స్నేహిత పెద్దమ్మ కుమారుడు అజయ్ కుమార్ కూడా తనను మానసికంగా శారీరకంగా అనుభవిస్తూ వేధిస్తున్నాడని స్నేహిత తెలిపింది. స్నేహిత ఈ విషయాన్ని తన తల్లి పెద్దమ్మలకు చెప్పినా ఏమీ కాదని ఒకవేళ కడుపు వస్తే…. మేమే తీయిస్తామని చెప్పినట్లు స్నేహిత పేర్కొంది.
ఇక ఆఖరికి ఆ కామందుల వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన స్నేహిత ఆ ఇద్దరిపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.