ఆన్లైన్ బెట్టింగ్స్ ఓ కుటుంబంలో తీరని విషాదం మిగిల్చింది. చేతికి అంది వచ్చిన చెట్టంత కొడుకును ఆన్లైన్ బెట్టింగ్స్ బలి తీసుకుంది. బీరువాలో దాచిన బంగారం కూడా కుదవపెట్టి బెట్టింగ్స్‌లో ఓడిపోవడం… బీరువాలో దాచిన బంగారం తల్లికి కనిపించక నిలదీయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన పెద్ద కొడుకు వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. పహాడిషరీఫ్ లోని మామిడిపల్లికి చెందిన చంద్రయ్య, శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు.
పెద్దకుమారుడు రాజశేఖర్ (26) ఇంటర్మీడియట్ వరకు చదివి, గత కొంతకాలంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గత సంవత్సరం కాలంగా రాజశేఖర్ ఆన్లైన్లో ప్లేయింగ్ కార్డ్స్, క్రికెట్ బెట్టింగ్‌లు ఆడేవాడు. ఆన్లైన్ బెట్టింగ్స్‌కు భానిసై సంవత్సరకాలంలోనే మూడు నుంచి నాలుగు లక్షల వరకు డబ్బులు పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తల్లి శశికళ బీరువాలో దాచిపెట్టిన బంగారంను సైతం కుదవ పెట్టి ఆన్లైన్ బెట్టింగ్‌లు ఆడి ఓడిపోయాడు. చివరకు తన బంగారంను కూడా కుదువపెట్టి బెట్టింగ్ లో పోగొట్టుకుని చేసేదేమీ లేక చివరకు యువకుడు ఓ వేపచెట్టుకు రాజశేఖర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొని ఉండడం కనిపించింది. ఈ ఘటనపై పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.