వెల్గటూర్, (ప్రభ న్యూస్) : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట సమీపంలో రాష్ట్రరహదారిపై మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ మొక్కట్రావుపేటకు చెందిన కూస రాజ్ కుమార్ చనిపోయాడు. మరో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి . మొక్కట్రావుపేటకు చెందిన కూస రాజ్‌కుమార్, కుమ్మరిపల్లెకు చెందిన జక్కుల అంజి.. దర్మపురి నుండి వస్తున్న జనసేన అదినేత పవణ్ కల్యాణ్ కాన్వాయ్‌ని ఫాలో అవుతూ బైక్ పై వస్తున్నారు. కాగా, కాన్వాయ్ దాటేందుకు రోడ్డు పక్కనుండి వెళుతుండగా ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టారు. ఆ తర్వాత మరో కార్ ను ఢీకొట్టడంతో రాజకుమార్ అక్కడికక్కడే చనిపోయాడు.
కిషన్‌రావుపేటకు చెందిన బావ బావమరుదులు పొలిశెట్టి శ్రీనివాస్ , నీలం సాగర్ కు తీవ్రగాయాలయ్యాయి . శ్రీనివాస్ వెల్గటూర్ తహసీల్దార్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తుండగా, సాగర్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. మృతుడి బైకుపై ఉన్న మరో యువకుడు జక్కుల అంజికి గాయాలయ్యాయి . మృతుడు రాజకుమార్ పవణ్ కల్యాణ్ వీరాభిమానిగా తెలిసింది. కాన్వాయ్ వెంట బైకుపై జై కొడుతూ వెళ్లినట్టు చూసిన వారు చెబుతున్నారు . తీవ్రగాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.