ఫిబ్రవరిలో Samsung బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S23 సిరీస్ మార్కెట్ లో రిలీజ్ అయింది. గెలాక్సీ S23 సిరీస్ నుంచి వచ్చిన స్మార్ట్ఫోన్లు “Galaxy S23 అల్ట్రా, Galaxy S23+ & Galaxy S23”. ఈ స్మార్ట్ఫోన్లు ఇప్పటికే దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో వచ్చాయి. కాగా, ఇప్పుడు ఈ ఫోన్లు ఆకర్షణీయమైన ఆఫర్లతో మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ మూడు స్మార్ట్ఫోన్లలో అత్యంత ప్రీమియం డివైజ్ అయిన గెలాక్సీ S23 అల్ట్రాలో కస్టమర్లు రూ.18,000 విలువైన ప్రయోజనాలతో పాటు 12-నెలల నో-కాస్ట్ EMIని పొందవచ్చని Samsung ప్రకటించింది. గెలాక్సీ S23 అల్ట్రా.. 200MP ప్రైమరీ కెమెరాతో కూడిన కెమెరా-సెంట్రిక్ ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా ‘నైటోగ్రఫీ’ కోసం నిర్మించబడినట్లు Samsung కంపెనీ వెల్లడించింది. 24-నెలల EMIతో నెలకు రూ.5,209తో ఫోన్‌ను పొందవచ్చు. అంతే కాకుండా కస్టమర్లు రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు.
Galaxy S23+ & Galaxy S23ని రూ.13,000తో 12 నెలల నో కాస్ట్ EMIతో సొంతం చేసుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ మూడు స్మార్ట్ఫోన్లలో లభిస్తుంది. ఈ సంవత్సరం దేశంలో లేదా మరెక్కడా ఎక్సినోస్ వేరియంట్ లేదు. భారతదేశంలో విక్రయించే అన్ని యూనిట్లు నోయిడా ఫ్యాక్టరీలో తయారు చేయబడుతున్నాయని శామ్సంగ్ తెలిపింది.