బెల్జియంలో విమాన పైలట్ కావడానికి సిద్ధమవుతున్న బ్రిటీష్ మహిళ దోమ కాటుకు గురై చనిపోయింది. ఆమే పేరు ఓరియానా పెప్పర్, వయస్సు 21. గత ఏడాది ఆంట్‌వెర్ప్‌కు (బెల్జియం షెల్డ్ట్ నదిపై ఉన్న ఓడరేవు నగరం) వెళ్లినప్పుడు పురుగు కాటుకు గురైంది. దాంతో మెదడుకు వ్యాపించే అనారోగ్యం ఆమెకు కలిగింది. దాంతొ ఆమె కుడి కంటికి దగ్గరగా ఎర్రబడిన కాటు గాయాన్ని గుర్తించి.. డాక్టర్ ని సంప్రదించగా యాంటీబయాటిక్ మందులు రాసిచ్చారు.
అయితే.. రెండు రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆమె నడవలేని స్థితికి చేరి కుప్పకూలిపోవడంతో ఆమె బోయ్ ఫ్రెండ్ మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దురదృష్టవశాత్తు, ఇన్ఫెక్షన్ ఆమె మెదడుకు వ్యాపించడం, రక్తం గడ్డకట్టడం వల్ల ఆమెను డాక్టర్లు రక్షించలేకపోయారు. అయితే.. ఈ వార్తలను ధ్రువీకరిస్తూ దీనికి సంబంధించిన దర్యాప్తు ఫైనల్ రిపోర్ట్ ఈమధ్యనే విడుదలైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.