రాష్ట్రంలో పోడు భూముల పంపిణీ కోసం రైతుల వద్ద నుంచి దరఖా స్తులను స్వీకరించే ప్రక్రియ పూర్తికావడంతో కోటి ఆశలతో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గత నెల 8వ తేదీ నుంచి ఈనెల 8వ తేదీ వరకు నెలరోజుల పాటు పోడు సాగుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన కోసం ఆవాసాల వారీగా ఎఫ్‌ఆర్‌సి కమిటీలను ఏర్పాటు చేశారు.
అటవీ హక్కుల చట్టం ప్రకారం దరఖాస్తుల ప్రక్రియ క్షేత్ర స్థాయిలో ఎఫ్‌ఆర్‌సి కమిటీలు చేపట్టాలి, నిజమైన లబ్ధిదారులను గుర్తించి మండల, జిల్లా స్థాయి కమిటీలకు లబ్ధిదారుల జాబితాతో కూడిన నివేదికను పంపించాలి. అయితే దరఖాస్తులను స్వీకరించి ఏడు రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అధికారులకు అందలేదు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital