తిరుపతి : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలోని నేలటూరు గ్రామంలో ఏపీ జెన్‌కో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ మూడో యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొనటానికి రేణిగుంట విమానాశ్రయానికి ఉదయం 10:35 గంటలకు చేరుకున్న వీరికి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు- సత్యనారాయణ, రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, తిరుపతి నగర పాలక మేయర్ డా. శిరీష, డిప్యూటీ- మేయర్ అభినయ్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, కోనేటి అదిమూలం, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీ-టీ-డీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, తిరుపతి జిల్లా కలెక్టర్ కే.వెంకట రమణ రెడ్డి, ఈఎంసి క్లస్టర్ సీఈఓ గౌతమి, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని ఘనంగా రిసీవ్ చేసుకునగా ముఖ్యమంత్రి ఉదయం గం.10.45 గం.లకు హెలికాప్టర్‌లో నెల్లూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. వీరితో పాటు- ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిషోర్, సీఎస్‌ఓ రాజశేఖర్ డిప్యూటీ- కమాండెంట్ శుక్లా, ఏఎస్పీ కులశేఖర్, జిల్లా ప్రొహిబిషన్, ఎ-కై-్సజ్ ఇన్‌ఛార్జి అధికారి దయాసాగర్, జిల్లా ఫైర్ అధికారి రమనయ్య, ఆర్డీవో శ్రీకాళహస్తి రామారావు, డీఎస్పీలు రామచంద్రయ్య, చంద్ర శేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement