నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ కర్నూల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. పాణ్యం మండలం బలపనూరు గ్రామం నెరవాడ మెట్ట ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను గవర్నర్ సందర్శించనున్నారు. ఎయిర్ పోర్ట్ వద్ద గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, డీఐజీ సెంథిల్ కుమార్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, కర్నూలు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఓర్వకల్లు జడ్పిటిసి రంగనాథ్ గౌడ్, ఎంపీపీ తిప్పన్న, కర్నూలు ఆర్డీవో హరి ప్రసాద్ లు గవర్నర్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గం ద్వారా నంద్యాల జిల్లా పాణ్యం మండలం బలపనూరు గ్రామం నెరవాడ మెట్ట ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల కు బయలుదేరి వెళ్లారు. గవర్నర్ తో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, గవర్నర్ కార్యాలయ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ఆర్.పి.సిసోడియా వెళ్లారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement