Wednesday, December 25, 2024

J & K | వాహ‌నం బోల్తా.. ఐదుగురు జ‌వాన్లు మృతి !

జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పూంచ్ జిల్లాలో సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపు తప్పి 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement