Friday, November 22, 2024

Great Gift | మెస్సీకి విలువైన కోటు.. బ‌హూక‌రించిన ఒమ‌న్ ఎంపీ

ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్లో విజయం తర్వాత అర్జెంటీనా కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ ఉద్వేగానికి గురయ్యాడు. సహచరులతో కలిసి డాన్స్‌ చేస్తూ సంబురాలు చేసుకున్నాడు. అయితే ట్రోఫీ అందుకునే ముందు ఖతర్‌రాజు షేక్‌ తమిన్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీ మెస్సీకి నల్లని కోటు తొడిగారు. ఆ కోటు ధర ఎంతంటే 10 లక్షల డాలర్లు అంత విలువైన కోటును మెస్సీకి ఎవరు బహుకరించారో తెలుసా… ఒమన్‌కు చెందిన అహ్మద్‌ అల్‌ బర్వానీ అనే పార్లమెంటు సభ్యుడు. ఇతను లాయర్‌ కూడా. ఖతర్‌ సుల్తాన్‌ తరపున వరల్డ్‌కప్‌ ట్రోఫీ నెగ్గినందుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

బంగారం, నలుపు రంగులో ఉన్న అరబిక్‌ బిష్త్‌ శౌర్యానికి, తెలివి తేటలకు ప్రతీక. అందుకు నీకు 10 లక్షల డాలర్లు ఇస్తున్నాను అంటూ అహ్మద్‌ ట్వీట్‌ చేశాడు. అరబ్‌ దేశాల్లో మగవాళ్లు పెళ్లిళ్లు, మతపరమైన పండుగుల వేళ అలాంటి కోటు వేసుకుంటారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అర్జెంటినా పెనాల్టి షూటౌట్‌లో 4-2తో ఫ్రాన్స్‌పై విజయం సాధించింది. దీంతో 32 ఏళ్ల తర్వాత అర్జెంటీనా మళ్లి వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. 2014 ఫైనల్లో మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా జర్మనీపై ఓడిపోవడంతో కప్‌ చేజారింది. ఈ సారి కప్‌ కొట్టడంతో కెరీర్‌లో చివరి ప్రపంచకప్‌ ఆడుతున్న మెస్సీ కల నిజమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement