సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. రాఫెల్ నాదల్, ఫెదరర్‌కు సాధ్యంకాని అత్యధికంగా 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. 37 ఏళ్ల వయసులో తిరిగి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది మూడు టైటిళ్లు నెగ్గిన అతడు ఇప్పటికే రూ.41 కోట్లు ప్రైజ్‌మనీ రూపంలో సంపాదించాడు.
ఇలా మొత్తంగా తన 20 ఏళ్ల టెన్నిస్ క్రీడా ప్రస్థానంలో 94 సింగిల్స్ టైటిళ్లు, ఒక డబుల్స్ ట్రోఫీ గెలిచాడు. ఈ విజయాలకు గాను ఇప్పటి వరకు అతడికి దాదాపు 1398 కోట్ల రూపాయలు సంపాదించాడు. 2003లో కెరీర్ ప్రారంభించిన జకోవిచ్, 2008లో తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచాడు. అక్కడి నుంచి దిగ్గజాలైన నాదల్, ఫెదరర్‌కు ప్రధాన పోటీదారుగా అవతరించాడు.