అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల రుణం తీసుకుంది. మంగళవారం ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని సెక్యూరిటీలు అమ్మి రూ.1000 కోట్లు అప్పు తీసుకుంది. పదేళ్లకు 7.69 శాతం వడ్డీతో రూ.వెయ్యి కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం వేసి రుణం తీసుకుంది.
కేంద్రం ఇచ్చిన రూ.4,557 కోట్లలో ఇప్పటికే 3వేల కోట్లు ప్రభుత్వం వాడేసింది. మరో రూ.1,557 కోట్లకు మాత్రమే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో మళ్లీ జీతాలు, పెన్షన్లకు రూ.5,500 కోట్లు అవసరం అవుతుంది.
- Advertisement -