గుజరాత్ లోని వడోదరలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. హార్నీమోత్నాథ్ సరస్సులో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు. మొత్తం పడవలో 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. పలువురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గల్లంతైన విద్యార్థులు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పరిమితికి మించి పడవలో విద్యార్థులను ఎక్కించుకోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. బోటు ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందడం పట్ల గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర సంతాపం తెలిపారు.