వరంగల్ కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని… రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం ఏబీవీపీ నాయకులు దహనం చేశారు.
మరో వైపు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వసతి గృహాలు తెరవాలంటూ వారు ఆందోళన చేస్తున్నారు. బార్లు,సినిమా హాళ్ల్లు ,పబ్బులకు అనుమతి ఇచ్చి విద్యాసంస్థలు బంద్ చేయడం సరికాదని అంటున్నారు.
విద్యాశాఖ యూనివర్సిటీలు బంద్ చేసి హాస్టల్స్ ఖాళీ చేయాలని ఒకవైపు,పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తామని కంట్రోలర్ చెప్పడం అయోమయానికి గురిచేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల మూసివేత నిర్ణయం సరైంది కాదని,వెంటనే ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.