Wednesday, November 20, 2024

TS | వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు.. సైనిక లాంఛ‌నాలతో అంత్యక్రియలు

నిజామాబాద్ (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతానికి చెందిన ఆర్మీ జవాన్ సిక్కింలో చ‌నిపోయాడు. డ్యూటీలో ఉండ‌గానే భారీ వర్షాల కారణంగా నది ఉగ్రరూపం దాల్చింది. ఈ సందర్భంలో లాన్స్ నాయక్ హోదాలో ఉన్న ప్రసాద్ వరదల్లో కొట్టుకుపోయారు. గాలింపు చర్యల్లో మృతదేహం గురువారం లభ్యం కావడంతో ఆర్మీ అధికారులు పోస్టుమార్టం నిర్వహించి విమానంలో హైదరాబాద్ కు తరలించారు.

ఆదివారం ఉదయం పార్థివ దేహాన్ని బోధన్ కు తీసుకొచ్చారు. బోధన్ మండలంలోని కుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మృతి ఈ ప్రాంత ప్రజలను కలిసివేసింది. జవాన్ మృతదేహం తీసుకొస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు కుల మతాలకు అతీతంగా రోడ్లపైకి తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. జవాన్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకుని యువకులు ఆచన్ పల్లి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.

సైనిక లాంచనాలతో వీర జవాన్ అంత్యక్రియలు

వీర జవాన్ ప్రసాద్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ఆర్మీ అధికారులు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో నివాళులు అర్పించి గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement