భూపాలపల్లి రూరల్, ప్రభన్యూస్: భూపాలపల్లి సింగరేణి డివిజన్ పరిధిలోని కేటీ-కే ఓసి రెండో ప్రాజెక్టును శనివారం కలకత్తా ఓ ఎ స్ డి సి సి ఓ కె ముఖోపాద్యాయ ఆధ్వర్యంలో అధికారుల బృందం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలకత్తా నుండి విచ్చేసిన అధికారుల బృందం ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణపై చర్యలు, గాలి, నీరు, శబ్ద కాలుష్యం నివారణ, ప్రధానంగా చెట్లను పెంచే కార్యక్రమం చేపట్టాలని స్థానిక సింగరేణి అధికారులకు సూచించినట్లు- తెలిసింది. అదేవిధంగా బొగ్గు తవ్విన భాగంలో మట్టి నింపిన ప్రదేశాలను కలకత్తా ఉన్నతాధికారులు పరిశీలించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..