Friday, November 22, 2024

అధ్యాపకుల క్రమబద్ధీకరణలో ముందడుగు.. ప్రభుత్వానికి చేరిన జాబితా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించిన జాబితా ప్రభుత్వానికి చేరినట్లు తెలిసింది. ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆ జాబితాను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు మంగళవారం సమర్పించినట్లుగా తెలిసింది. ఆ జాబితాను ఆమె పరిశీలించిన తర్వాత ఆమె నుండి సీఎస్‌కు చేరుతోంది. మళ్లి అక్కడి నుండి సీఎంవో కార్యాలయానికి వెళ్తోంది.

ఆ ఫైల్‌పై సీఎం సంతకం చెసిన తర్వాత కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లి సమావేశాల్లో 11,103 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి చేరిన ఈ జాబితాలో 3,500 నుంచి 3800 వరకు కాంట్రాక్టు అధ్యాపకులు వివరాలు ఉన్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement