Saturday, November 23, 2024

307 కి.మీ రేంజ్‌తో ఎలక్ట్రిక బైక్.. లాంచ్‌ చేసిన స్టార్టప్‌ కంపెనీ

బెంగళూర్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ అల్ట్రావైలెట్‌ ఎఫ్‌77 పేరుతో ఎలక్ట్రిక్‌ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. స్టాండర్డ్‌, రెకాన్‌ వెరియంట్లలో ఈ బైక్‌ను తీసుకు వచ్చింది. వీటితో పాటు లిమిటెడ్‌ ఎడిషన్‌ పేరుతో మరో వేరియంట్‌ను విడుదల చేసింది. బేస్‌ మోడల్‌ బైక్‌ ధరను 3.8 లక్షలుగా నిర్ణయించింది. రెకాన్‌ మేరియంట్‌ ధరను 4.5 లక్షలుగా, లిమిటెడ్‌ ఎడిషన్‌ ధరను 5.5 లక్షలుగా నిర్ణయించింది. ఎఫ్‌77 స్టాండర్డ్‌ వెర్షన్‌ బైక్‌ రేంజ్‌ 206 కిలోమీటర్లు, ఎఫ్‌77 రెకాన్‌ ఒకసారి ఛార్జింగ్‌తో 307 కిలోమీటర్లు ప్రయానించవచ్చు. బ్యాటరీపై కంపెనీ 8 సంవత్సరాల వారెంటీ ఇస్తోంది. ఎఫ్‌77 స్టాండర్డ్‌ వెర్షన్‌ 27కిలోవాట్‌ పవర్‌ను విడుదల చేస్తుంది. గరిష్టంగా 140 కిలోమీటర్ల స్పీడ్‌తో ప్రయాణించగలదు.

రెకాన్‌ వెర్షన్‌ బైక్‌ గరిష్టంగా 147 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. లిమిటెడ్‌ వెర్షన్‌లో కేవలం 77 బైక్‌లను మాత్రమే ఉత్పత్తి చేశారు. ఈ బైక్‌ గరిష్టంగా 152 కిలోమీటర్ల వేగతో వెళుతుంది. మూడు బైక్స్‌లోనూ గ్లైడ్‌, కంబాట్‌, బాలిస్టిక్‌ అనే మూడు రైడింగ్‌ మోడ్స్‌ ఉన్నాయి. ఈ బైక్స్‌ను 10 వేల రూపాయలతో బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2023 జనవరి నుంచి ముందు బెంగళూర్‌లో, తరువాత ఢిల్లి, ముంబై, చెన్నయ్‌, హైదరాబాద్‌ వంటి నగరాల్లోనూ డెలివరీ ఇస్తామని కంపెనీ తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement