హైదరాబాద్, ఆంధ్రప్రభ : దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వికలాంగుల జాబ్ పోర్టల్ పేరుతో తీసుకువచ్చినీ ప్రత్యేక పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటే ప్రయివేటు కంపెనీల్లో ప్రభుత్వం ఉపాధి అవకాశాలను చూపించనుంది.
ఉపాధి అవకాశాలను మెరుగుపరిచెందుకు ఈ ఆ్లనన్ జాబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. యూత్ ఫర్ జాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈ ప్రత్యేక పోర్టల్‌ను సోమవారం సచివాలయంలో మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు వికలాంగుల ప్రత్యేక జాబు పోర్టల్‌ను సీతక్క ఆవిష్కరిస్తారు.