తల్లిని కొడుకు దారుణంగా హత్య చేశాడు. ఇటుకలు, రాళ్లతో కొట్టి చంపిన ఉదంతం సింఘౌల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బెగుసరాయ్‌లో పచ్చంబ వార్డు నంబర్ 17కి లో సింగ్ భార్య నూతన్ దేవి (45) నివాసముంటుంది. ఆమెకు ఆనంద్‌కుమార్, అనుభవ్ కుమార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి నుంచి ఆలయానికి పూజల నిమిత్తం వెళ్లగా.. ఆమెను పట్టుకొని గదిలో బంధింది ఇటుకలు, రాయితో తలపై మోది కొట్టి చంపాడు. నూతన్ దేవి అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని గదికి వేసిన తాళం పగులగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే చనిపోయింది. నిందితుడు ఆనంద్ కుమార్ పారిపోయేందుకు ప్రయత్నిస్తే ప్రజలు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై స్థానికులు సింఘాల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సింఘౌల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement