ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు అత్యాధునిక సదుపాయలతో అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్లు చేయలేని పని అంటూ ఉందా అన్నంతగా మన జీవితాల్లో ఇవి అల్లుకుపోయాయి. అలాంటి స్మార్ట్ ఫోన్లకు చెక్ పెట్టేందుకు ఒక చిన్న డివైజ్ మార్కెట్‌లోకి రానుంది. ఈ చిన్న డివైజ్ పేరు ‘‘ఏఐ పిన్’’. స్మార్ట్ ఫోన్ తరహాలోనే అన్ని పనులు ఇది చేయగలదు. అమెరికాకు చెందిన స్టార్టప్ హ్యుమేన్. యాపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు ఈ కంపెనీని ప్రారంభించారు.
ఏఐ పిన్ అనేది ఎలాంటి స్క్రీన్ లేని ఓ వేరేబుల్ డివైజ్. అకారంలో చిన్నగా తక్కువ బరువుతో ఉంటుంది. మన దుస్తులపై ఎక్కడైనా దీన్ని అతికించుకోవచ్చు. ఇది స్నాప్‌డ్రాగన్ ప్రొసెసర్‌తో పని చేస్తుంది. దీంట్లో కెమెరా, మైక్రోఫోన్, యాక్సెలరోమీటర్ వంటి సెన్సర్లు ఉన్నాయి. ఈ డివైజ్‌తో కాల్స్ చేసుకోవచ్చు. మేసేజ్‌లు పంపించవచ్చు. ఫోటోలు తీసుకోవచ్చు. వీడియో కూడా రికార్డు చేయవచ్చు.
ఇందు కోసం ఎలాంటి యాప్స్ అవసరం లేదు. ఇందులో ఉండే బిల్డ్ ఇన్ ప్రొజెక్టర్ సాయంతో మన అరచేతిని లేదంటే ఏదైనా వస్తువుపై డిస్‌ప్లేగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. స్మార్ట్ ఫోన్‌లా కాకుండా ఇది వివిధ రకాల సెన్సర్లు, ఏఐ టెక్నాలజీతో పని చేస్తుంది. ఇందులోని లాంగ్వేజ్ మోడల్స్ మన అవసరాలను అర్ధం చేసుకుని దానికి అనుగుణంగా సమాధానం ఇస్తుంది.
మీరు ఎవరికైడా కాల్ చేయాలంటే వారి పేరు చెప్తే కాల్ వెళుతుంది. టైప్ చేయాల్సిన అవసరంలేదు. మెసేజ్ కూడా టైప్ చేయాల్సిన అవసరంలేకుండానే పంపించవచ్చు. ఇతర డివైజ్‌లను దీని ద్వారా కంట్రోల్ కూడా చేయవచ్చు. అతల వ్యక్తి వేరే భాషలో మాట్లాడిన దాన్ని ట్రాన్స్‌లేట్ కూడా చేస్తుంది. వర్చువల్ అసిస్టెంట్‌గా కూడా పని చేస్తుంది. ఈ డివైజ్ ధరను కంపెనీ 699 డాలర్లుగా నిర్ణయించింది. 2024 నుంచి దీని డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.