Monday, November 25, 2024

Delhi: ఎన్డీఎ కూటమికి షాక్… కేంద్ర మంత్రి పదవికి పశుపతి రాజీనామా

లోక్‌సభ ఎన్నికలకు బిహార్‌ లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఇందులో చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ (రాంవిలాస్‌) పార్టీకి బిజెపి ఐదు సీట్లు కేటాయించింది. ఈ పరిణామాలతో అసంతృప్తికి గురైన చిరాగ్‌ బాబాయి, రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్‌ పరాస్‌ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇదిలా ఉంటే ఎన్డీయే మిత్రపక్షమైన లోక్‌ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దళిత నేతగా పేరొందిన రాంవిలాస్‌ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్‌, సోదరుడు పరాస్‌ మధ్య విభేదాలు తలెత్తాయి… ఈ క్రమంలోనే 2021లో పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. చిరాగ్‌ ఎన్డీయే నుంచి బయటకు రాగా కూటమిలో ఉన్న పశుపతి పరాస్‌కు కేంద్రమంత్రి పదవి దక్కింది.

అయితే, ఇటీవల ఎన్డీయే విస్తరణలో భాగంగా చిరాగ్‌ మళ్లీ కూటమిలో చేరగా.. తాజా సర్దుబాటులో ఆ పార్టీకి ఏకంగా అయిదు సీట్లు బిజెపి కేటాయించింది.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుతం ప్రాతినిధ్యం హాజీపుర్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పరాస్‌కు ఇప్పుడు కూటమిలో సీట్లు దక్కలేదు. ఇది ఆయనను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.. విపక్ష ఇండియా కూటమిలో చేరనున్నట్లు పరాస్‌ మంగళవారం మీడియాకు వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement