Friday, October 18, 2024

T20 WC | ఆస్ట్రేలియాకు షాక్.. ఫైన‌ల్స్‌కు దూసుకెళ్లిన స‌ఫారీలు !

టీ20 ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా జట్టు షాక్ ఇచ్చింది. నేడు (గురువారం) జరిగిన సెమీస్ పోరులో ఆసీస్ జట్టుపై 8వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 134/5 స్కోరు చేసింది.

ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 17.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సాధించింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ (37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ *42) రాణించగా, వన్ డౌన్ బ్యాటర్ అన్నెకే బోష్ (48 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ *74 నాటౌట్) దంచికొట్టింది.

రేపు (శుక్రవారం) మరో సెమీఫైనల్‌లో వెస్టిండీస్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఆదివారం (అక్టోబర్ 20) ఫైనల్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement