Saturday, October 5, 2024

IND vs ZIM | యువ జట్టుకి షాక్…. తొలి టీ20 జింబాబ్వే దే !

టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు ఘోర పరాజయాన్ని చవిచూశారు. జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు హరారేలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే 13 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది.

ఇక 116 పరుగుల స్వ‌ల్ప టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియా 102 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 31 టాప్ స్కోర‌ర్‌‌గా నిలిచాడు. ఆఖర్లో అవేష్ ఖాన్ (16), వాషింగ్టన్ సుందర్ (27) పరుగులు చేసి అవుట్ అయ్యారు.

జింబాబ్వే బౌలర్లలో తెందాయ్ చతారా 3, కెప్టెన్ సికిందర్ రజా 3 వికెట్లు తీసి రాణించారు. ఇక బ్రయాన్ బెన్నెట్ 1, వెల్లింగ్టన్ మసకద్జా 1, బ్లెస్సింగ్ ముజరబాని 1, ల్యూక్ జోంగ్వే 1 వికెట్ తీశారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో జింబాబ్వే 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ రేపు (జులై 7) హరారేలోనే జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement