ఏ గల్లీలో చూసినా గుంపులు గుంపులుగా ఉంటాయి. సంచులు పట్టుకుని వస్తుంటే చాలు పరుగెత్తిస్తాయి. బైకులపై వచ్చే వాళ్లకూ భయం పుట్టిస్తాయి. ఇక చిన్నపిల్లలు ఒంటరిగా కనిపిస్తే తెగబడిపోతాయి. రాత్రి వేళ్లల్లోనైతే… పట్టాపగ్గాలే ఉండవు. ఇందంతా ఏవో రౌడీ గ్యాంగ్‌ల గురించి కాదండోయ్… గల్లీల్లో దర్జాగా గర్జిస్తున్న వీధికుక్కల దౌర్జన్యం ఇది. ఇటీవల అంబర్‌పేట్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడితో చనిపోయాడు. తాజాగా వరంగల్ జిల్లా కాశిబుగ్గలో మరో వీధి కుక్కల దాడి ఘటన తెరపైకి వచ్చింది. కాశిబుగ్గ పోచమ్మ గుడి ప్రాంతంలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. ఏడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశారు. ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాలుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement