ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిన్న జరిగిన పోలీసుల కాల్పుల్లో 17 మంది మావోయిస్టు మరణించారు. అయితే, ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత, పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మరణించాడు. దామోదర్ చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.
దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి కాగా, ఆయన దాదాపు 30 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేశారు. మావోయిస్టు యాక్షన్ టీమ్‌ల ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశారు. పోలీసులకు మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న దామోదర్‌పై తెలంగాణలో 25 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో 50 లక్షలు రివార్డు ఉంది. ఆరు నెలల క్రితం మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.