Tuesday, November 26, 2024

Delhi: సుప్రీంకోర్టులో హేమంత్‌ సోరెన్‌కు ఎదురుదెబ్బ

జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ప్రస్తుతం తాము జోక్యం చేసుకోమని.. ముందుగా హైకోర్టుకు వెళ్లాలని తెలిపింది. కాగా భూ కుంభకోణంలో తన అరెస్టు అక్రమమంటూ సోరెన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధం, తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనంటూ పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని కోరారు.​ దీనిపై విచారణ జరిపిన సీజేఐ డీవీ చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌లు సంజీవ్‌ఖన్నా, ఎంఎం సుందరేష్‌, బేల ఎం త్రివేదిలతో కూడిన ప్రత్యేక త్రిసభ ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement