Tuesday, November 26, 2024

ఏఐతో ఉద్యోగాలకు ఢోకాలేదన్న రోబోట్‌.. మొదటి రోబోట్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌

జెనివాలో జరుగుతున్న ఏఐ ఫర్‌ గుడ్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా ప్రపంచంలోనే మొదటిసారి మానవ – రోబోట్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఇందులో పాల్గొన్న విలేకరులు అడిగిన ప్రశ్నలకు రోబోట్‌లు సమాధానం ఇచ్చాయి. రోబోల సంఖ్య పెంచుకోవడం ద్వారా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక కఠినమైన సవాళ్ళను ఎదుర్కోవడంలొ కీలక పాత్ర పోషించడం పట్ల రోబోట్‌లు ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి.

కఠినమైన నిబంధనల అవశ్యకత గురించి అడిగిన ప్రశ్నలకు మనిషి రూపంలో ఉన్న ఈ రోబోట్‌ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రపంచంలో ఉన్న ఆకటి, వ్యాధుల వంటి సమస్యలను పరిష్కరించడంలో కృత్రిమ మేధస్సు (ఏఐ), దాని రోబోటిక్‌ అప్లికేషన్‌ల సామర్ధ్యాన్ని హైలైట్‌ చేయడం ఈ ఈవెంట్‌ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నీలిరంగు నర్సు యూనిఫాంలో ఉన్న మెడికల్‌ రోబోట్‌ గ్రేస్‌, మరో రోబోట్‌ అమెకా పాల్గొని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాయి. తాను మనుషులతో కలిసి పని చేయడానికి సహాయం, మద్దతు ఇస్తానని గ్రేస్‌ తెలిపింది. ఇప్పటికే ఉన్న ఉద్యోగాలను తాను భర్తీ చేయనని స్పష్టం చేసింది. ఒక జర్నలిస్టు ఆమె ఖత్చితత్వాన్ని ప్రశ్నించారు.

- Advertisement -

దీనికి స్పందించిన గ్రేస్‌ అవును నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని బదులిచ్చింది. సహకారం పట్ల తాము నిబద్ధతతో ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మరో రోబోట్‌ అమెకా ఆకర్షణీయమైన ముఖ కవళికలను ప్రదర్శించగల టెక్నాలజీతో రూపొందించారు. ప్రజల జీవితాలను మెరగుపరచడంలో తన లాంటి వేలాది రోబోలు గణనీయమైన మార్పును తెచ్చే భవిష్యత్తును ఇది నిదర్శనమని పేర్కొంది. అమెకాను మరో జర్నలిస్టు ప్రశ్నిస్తూ నిన్ను సృష్టించిన విల్‌ జాక్సన్‌పై తిరుగుబాటు చేస్తారా అని అడిగారు. దీనికి స్పందించిన అమెకా మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తారో నాకు ఖచ్చితంగా తెలియదని తన నీలి కళ్లను పెద్దవిగా చేస్తూ సమాధానం ఇచ్చింది. తనను సృష్టించినందుకు ఆ రోబోట్‌ విల్‌ జాక్సన్‌కు కృతజ్జత తెలుపుతూ ప్రశంసించింది. తన ప్రస్తుత స్థితి పట్ల సంతృప్తికి వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement